26, ఆగస్టు 2015, బుధవారం

అర్త్దరాత్రి.... కార్యలయంలొ ......

     అర్త్దరాత్రి.... కార్యలయంలొ ......

జీవులన్నీ సంధ్యా  సమయం కాగానె ఇంటి ముఖం పడతాయి. పిట్టలు,ఆవులు,గెదెలు,మెకలు,గొర్రెలు  ఒక్క మనిషి తప్ప. ఏప్పుడు పనె ఈ జీవితానికి. సాదారణంగా అందరు సాయంత్రానికి ఇంటికి వచ్హెస్తారు , పని కొంచెం ఆలస్యం   ఐతె రాత్రికి వస్తారు , ఈ సహాయక ఉద్యొగాలు (Support Projects) ఎమిటొ కాని రాత్రికి పని కొసం బయలుదెరటం.

అందరు చెంగు చెంగుమని ఇంటికి పోతా ఉంటె ఇప్పుడు పనికి పొయ్యేది ఏందీ అంట.... సన్నాసి... :P.

ప్రభుత్వ ఆసుపత్రి లో అనాధ శవం లాగ ..... ఒక మూలగ కూర్చొని పని చేస్కోవటం .... పని లేదంటే అక్కడే నిద్ర పోలేక ... అక్కడి నుండి బయటికి పొలెక... మాట్లాడానికి మనుషులు లెక.... వద్దురా బాబు .... ఏ బ్రాహ్మి కి కూడా ఈ కష్టాలు వద్దు.

వారపు రోజుల్లోనే ఇలా ఉంటె .. ఇంకా వారంతంలో వచ్చే వాళ్లకి పాదభివన్దనాలు.... _/\_

మాములుగా  ఊర్లో ఐతే .. ఈ రాత్రిళ్ళు నక్కల అరుపులు వినపడతాయి ..  ఇక్కడ కీ బోర్డు శబ్దాలే కాని  మనుషుల గుండె చప్పుడు కూడా వినపడదు.

ఐన తప్పదు  ఉద్గోగం పురుష లక్షణం (ఆడోల్లు చూస్తె తన్తరేమో  .. ఈ వివక్ష ఏంటి అని ).....  ఉద్గోగం మానవ లక్షణం ....  మానేసి జీవితం లో ఇంకా ముందుకు వెళ్లకపోవటం మనిషి బద్ధకం ....

గేటు దగ్గర కాపలా వాడికి  ... ఈ పెట్టె ముందు నాకు అట్టె తేడా ఏమి కనపడటం లెదు... హిహిహి





 


 
 

2 కామెంట్‌లు:

  1. నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు , అర్ధరాత్రి టీ కోసం బయటకి వచ్చి , ఆలోచించేది ఇదే ..
    దూ .... రం ......... గా పారిపోవాలని అనిపిస్తుంది .
    కాని మళ్ళి మాములుగానే బయటకి వచ్చి కాబ్ లో పడుకోవడమే

    రిప్లయితొలగించండి